అందుకే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లాగే కాంగ్రెస్‌కూ రజాకార్ల పార్టీ అంటే భయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అందు కే గత ప్రభుత్వం మాదిరి మజ్లిస్ పార్టీకి తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా జరపడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అమీర్ అలీఖాన్ ను ఎమ్మెల్సీని చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి భయపడి ఆయనకు మంత్రి పదవి ఇవ్వ డం లేదని ఆరోపించారు. రాష్ర్టంలో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నట్లు ఏలేటి వెల్లడించారు. ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకొని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అంది ంచే నష్ట అంచనాల నివేదిక ఆధారం గా కేంద్రం సాయం చేస్తుందన్నారు. రాష్ర్టంలో రెండు కేంద్ర బృందాలు ఏరియల్ సర్వే చేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయన్నారు.