08-04-2025 12:00:00 AM
ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు
కాటారం, ఏప్రిల్ 7: దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ కంకణం కట్టుకున్నదని రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు జై బాపు జైభీమ్ జైసంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచన మేరకు కాటారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి, శ్రీనుబాబు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగం పౌరు లకు కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
దేశ రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కాటారం అధ్యక్షుడు వేము నూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నాయకులు చీమల సందీప్, చిటూరి మహేశ్గౌడ్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, అయిత శకుంతల, కుంభం రమేశ్రెడ్డి, కొట్టే ప్రభాకర్, కడారి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు