07-04-2025 04:27:24 PM
ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి..
కాటారం (విజయక్రాంతి): దేశంలో శాంతి సౌభాత్రుత్వం పరిరవిల్లాలని, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నదని రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ళ శీను బాబుతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు కాలినడకన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఐసిసి, టీపీసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమన్నీ చేపట్టారు.
ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాఘవ రెడ్డి, శ్రీను బాబులు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం హక్కులను కాలరస్తున్నారని అన్నారు. మహాత్మ గాంధీ చూపిన శాంతి, అహింస సిద్ధాంతాలను విస్మరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మాజీ ఎంపీటీసీ ఉడుముల విజయ రెడ్డి, అయిత శకుంతల, కుంభం రమేష్ రెడ్డి, కొట్టే ప్రభాకర్, కడారి విక్రమ్, మంత్రి నరేష్, వోన్న వంశవర్ధన్ రావు, గద్దె సమ్మిరెడ్డి, అజీజ్ ఖాన్, అమీర్ ఖాన్, సుందిళ్ల ప్రభుదాసు, బీరెల్లి మహేష్, మాచర్ల రాజేందర్, పసుల మొగిలి, గోనె మహేష్, రాజ్ కుమార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.