మహారాష్ట్రలో రేవంత్ హామీలు పనిచేయలేదు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఎన్నికల ఫలితాలకు ముందే ఎమ్మెల్యేలను తర లించేందుకు కాంగ్రెస్ ౪ ప్రత్యేక విమానాలను బుక్ చేసుకుని నవ్వుల పాలైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డే కాదు.. ఆయన ఇక్కడినుంచి పంపిన డబ్బు కూడా మహారాష్ర్టలో పనిచేయలేదన్నారు. మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
హైదరా బాద్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌కే మరోసారి పట్టం కట్టారని తెలిపారు. రాహుల్‌గాంధీ చిలక పలుకులకు ప్రజలు ఏమాత్రం స్పందించ లేదన్నారు. గతంలో కంటే సగం సీట్లు కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నా రు. బాలాసాహెబ్ ఠాక్రే రాజకీయ వారసత్వం ఉద్ధవ్‌కు లేదని నిరూపిత మైందన్నారు. శరద్‌పవార్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ జరి గిందంటూ విమర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.