- అల్లు అర్జున్‌కు, రేవంత్‌కు చెడింది
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, డిసెంబరు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేరా ఫ్ కమీషన్ల సర్కార్‌గా మారిందని, ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు దండుకుంటుందోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో తాజా మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ కేబినెట్‌లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, కమీషన్లపై కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం నడుస్తోందన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరుకాక రాష్ట్రవ్యాప్తంగా 12,769 మంది మాజీ సర్పంచులు రోడ్డున పడ్డారన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు పోయి బెయిల్‌పై వచ్చినా అసెంబ్లీలో చర్చిండాన్ని చూస్తే సీఎం రేవంత్‌రెడ్డికి, అల్లు అర్జున్‌కు మధ్య ఎక్కడో చెడిందని బండి సంజయ్ అన్నారు. పుష్ప సినిమా ఇంకా స్టార్ట్ కాకున్నా పుష్ప సినిమా చూపించారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డిని గొప్ప నాయకుడని పవన్‌కల్యాణ్ అనడం చూస్తుంటే రేవంత్‌లో ఏం కనిపించిందోనని అన్నారు.