calender_icon.png 7 February, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్

07-02-2025 01:12:28 AM

* ఎన్నికల్లో ఆయన్ను రెండుసార్లు ఓడించింది

* రాజకీయ ప్రయోజనం కోసమే ఇప్పుడు ‘జై భీమ్’ నినాదం

* రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చలో ప్రధాని మోదీ 

నేషన్ ఫస్ట్ మా విధానం. దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్క రించా లి. విద్యారంగం అభివృద్ధి దిశగానే మా ప్రభుత్వ పథకాలు ఉంటాయి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరో పించారు.  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేస్తుం దంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు.

అంబేద్కర్‌ను కాంగ్రె స్ ఏనాడూ గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ బాబాసాహెబ్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించిందని దుయ్యబట్టారు. భారత రత్న అవార్డుకు ఆయన అర్హుడని ఆ పార్టీ ఎ ప్పుడూ భావించలేదని ఆరోపించారు.  రాజకీయ ప్రయోజనం కోసం ఇప్పుడు ‘జై భీమ్’ నినాదాన్ని ఎత్తుకుందని వివమర్శించారు. 

కాంగ్రెస్‌కు అది వర్తించదు

కాంగ్రెస్‌కు రాజ్యాంగం వర్తించదని ప్రధాని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయం లో జార్జి ఫెర్నాండెజ్ వంటి నాయకులను కాంగ్రెస్ బంధించిందని దుయ్యబట్టారు. ఎ మర్జెన్సీకి బహిరంగంగా మద్దతు పలకాలని ప్రముఖ నటుడు దేవ్ ఆనంద్‌ను ఆనాడు కాంగ్రెస్ కోరిందని.. అయితే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ ఆయన సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం కాకుండా బ్యాన్ వి ధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళనలో పాల్గొన్నందుకు ప్రముఖ నటుడు బలరాజ్ సాహ్నీని జైలుకు పంపినట్టు వెల్లడించారు. 

కులగణన డిమాండ్‌పై..

దేశ వ్యాప్తంగా కులగణను చేయాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న డి మాండ్‌పై ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వ జమెత్తారు.  కులాల పేరుతో విషాన్ని వ్యాప్తి చేయడానికి కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. బీజేపీ ఓబీసీ ప్యా నెల్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిందన్నారు. భారతీయుల ఆత్మవిశ్వాసం, వికసిత్ భారత్ సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్ర సంగంలో వివరణాత్మక సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. 

40వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన బైఅవుట్ ఆఫర్‌ను 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందిపుచ్చుకున్నా రు. తమ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటూ రాజీనామాను సమర్పించారు. ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్(ఓపీఎం) కూడా దీన్ని ధ్రువీకరించింది.

40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా పనితీరు సరిగా లే ని, కార్యాలయాలకు వచ్చి పని చేయడానికి ఇష్టపడని ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

సుమారు 20లక్షల మంది ఉ ద్యోగులకు ఓపీఎం ఈమెయిల్ పంపి.. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఇవ్వను న్న ట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 6వ తేదీలోగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని గడువు విధించింది.