calender_icon.png 17 March, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణకు నాంది పలికింది కాంగ్రెస్

17-03-2025 01:47:04 AM

నియోజకవర్గానికి గోదావరి , మూసీ జలాలు వచ్చే విధంగా కృషి

  పామాయిల్ తోటలతో  రైతులకు లాభదాయకం

 రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు

తుంగతుర్తి ,మార్చి 16: దేశంలో ఎస్సీ వర్గీకరణ బీసీ కులగనన నాంది పలికింది కాం గ్రెస్ పార్టీ అని, తుంగతుర్తి నియోజకవర్గం గోదావరి, మూసి జలాలతో సస్యశ్యామలం చేయుటకు కృషి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు.

ఆదివారం మండల కేంద్రం లోని మార్కెట్ యార్డులో ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన ఏర్పాటుపై కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ  సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నియోజకవర్గంలో గోదావరి , మూసి జలాలు తీసుకొని వచ్చి సస్యశ్యామల చేస్తానని హామీ ఇచ్చారు .నియోజక వర్గంలో పునాది కాలువకు 260 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఏబిసిడి వర్గీకరణ బీసీ కుల గణన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సాధించినట్లు తెలిపారు. వ్యవ సాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు సాధించినట్లు తెలిపారు.

తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ తుంగతుర్తి ప్రభుత్వ దవాఖాన 45 కోట్ల నిధులు రోడ్లకు 13 కోట్లతో పనులు సాగుతున్నట్లు తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ కుల గణనతో రావన్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ప్రజా ప్రతినిధులకు అవకాశం ఉన్న ట్లు తెలిపారు  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్ర తి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలోప్రజాయుద్ధ నౌక ఏపూరి సోమన్న, గిద్ద గళం గిద్దె రామ నరసయ్య, ఎర్ర  అనుదీపు కళాబృందం ఆట పాటలతో ఉర్రుతలు గించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీ  కుం దూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జుక్కల్ ఎమ్మె ల్యే లక్ష్మీకాంతం, మా జీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి,తెలంగాణ రైతు సమన్వయ సమితి కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,నల్లగొండ అద్యక్షుడు శంకర్ నాయక్, యాదా ద్రి అధ్యక్షుడు సంజీవరెడ్డి, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, నరసయ్య, పాల్గొన్నారు.