28-02-2025 01:44:02 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అసమర్థత, అల సత్వంతోపాటు ఎలాంటి అనుమతులు, సర్వే రిపోర్టు లేకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మం డిపడ్డారు. ఓ పక్క కార్మికులు సొరంగంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండ టం దుర్మార్గమన్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ సొరం గం కుప్పకూలి ౮ మంది కార్మికులు గల్లంతైన ఘటనలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాజె క్టు సందర్శన కోసం చేపట్టిన యాత్రతో రాజకీయ తూటాలు పేలాయి. గురువారం బీ ఆర్‌ఎస్ పార్టీ ఎస్‌ఎల్‌బీసీ సందర్శనతో అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడవకముందే ఇప్పటికే రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇలా ఐదు ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు.
జియో లాజికల్ సర్వే, రాక్ మెజర్మెం ట్ రిపోర్ట్ పొందకుండానే ఎవరి ఒత్తిడి వల్ల పనులు ప్రారంభించారో చెప్పాలని డిమాం డ్ చేశారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా రెస్క్యూ టీం సభ్యుల సమన్వయ లోపం కారణంగా కేవ లం ఒక తట్టెడు మట్టి మాత్రమే తీయగలిగారని అన్నారు.
కార్మికుల ప్రాణాలను కాపా డేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశా రు. దోమలపెంట ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రు ల బృందం టూరిస్ట్ ప్లేస్‌గా ఎంచుకుందని, హెలికాప్టర్లు వేసుకొని తిరగడానికే సరిపోయిందంటూమండిపడ్డారు. కార్మికుల కుటుంబ సభ్యులను ఎందుకు దాచాల్సిన పరిస్థితి వస్తుందో చెప్పాలన్నారు.