calender_icon.png 28 December, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం గొప్ప మేధావిని కోల్పోయింది: బోయ నగేష్

27-12-2024 08:45:05 PM

చార్మినార్,(విజయక్రాంతి): దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బోయ నగేష్ అన్నారు. శుక్రవారం ఛత్రినాక చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పువ్వుల మాలలు వేసి పలువురు కాంగ్రెస్ నేతలు  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ... దేశ ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏన్నో సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన ఆధ్యుడు అన్నారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకీ తీర్చలేని లోటన్నారు. పాలనలో జవాబుదారి తనం, పారదర్శకత ఉండాలని, 2005లో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన నాయకుడని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేశ యాదిలో చేరగని వారి చరిత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి. రాజు యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, శ్యామ్ రావు ముదిరాజ్, ప్రమోద్ కుమార్, రుక్మిణి నాయక్, ద్వారక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.