calender_icon.png 27 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలల కబంధ హస్తాలలో కాంగ్రెస్

26-01-2025 01:36:38 AM

  • వర్గీకరణ అమలు చేయకపోతే ఆపార్టీకి బుద్ధిచెబుతాం

సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సిద్దిపేట, జనవరి 25 (విజయక్రాంతి): వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాలల కబంధహస్తాలలో ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వచ్చేనెల 7న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనునన్నా ‘వేల గొంతుకలు... లక్ష డప్పులు’ నిరసన కార్యక్రమం సన్నహాక సమావేశం శనివారం సిద్దిపేటలో జరిగింది.

స్థానిక పాతబస్టాండ్ వద్ద గల డాక్టర బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ ముందుగా నివాళి అర్పించారు. కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్‌రాం విగ్రహం బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి వయెల గార్డెన్ వరకు నిర్వహించిన ర్యాలీలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలయేతర, దళితేతర కూలాలన్ని వర్గీకరణ కోరుకుంటున్నాయన్నారు.

మాలలకు ఉన్న రాజకీయ పలుకుబడితోనే తెలంగాణలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం లేదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణను అడ్డుకోవాలని లగడపాటి అడ్డుకునే ప్రయత్నం చేసినట్లే ఎస్సీ వర్గీకరణను.. మల్లు, వెంకటస్వామి కుటుంబాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. వర్గీకరణ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు.