బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవీలత
బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు కేటాయించాలి
బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్యప్రకాశ్
ముషీరాబాద్, జూలై 20: కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మధవీలత విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను పునరు ద్ధరించలేదన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు తక్షణమే నిధు లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సంక్షేమంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివేకానంద విదేశీ విద్యా పథకం పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్యప్రకాశ్ అన్న వజ్జుల మాట్లాడుతూ.. బ్రాహ్మణ పరిషత్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ సెల్ నాయకులు నిరంజన్ దేశ్‌పాం డే, నారాయణ చక్రవర్తులు, చింతపల్లి ఫణిభూషణ్, కైలాస్, వల్లీనాథ్, నాగేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
బీజేపీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యలో నిర్వహించిన సమావేశంలో తమను వేదికపైకి ఎందుకు పిలువలేదని అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే వేదికపై ఉన్న నాయకులను ప్రశ్నించారు. దీంతో కొంత మంది రాహుల్‌పై చేయి చేసుకోవడానికి ప్రత్నించగా పలువురు సభ్యులు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. పలువురు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది. అనంతరం రాహుల్‌కు మాట్లాడేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు.