వారి పాలనలోనే రైతు ఆత్మహత్యలు: గడ్కరీ
ముంబై, నవంబర్ 10: గ్రామీణ భారత్ ను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని, వారి పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్ధాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పాలించినా కాంగ్రెస్ గ్రామీణాభివృద్ధిపై దృష్టిపెట్టలేదని మండిపడ్డారు. మౌలిక వసతులైన తాగునీరు, రోడ్ల వంటి సౌకర్యాలైనా పట్టించుకోలేదన్నారు. కానీ, బీజేపీ అలాంటి పార్టీ కాదని, పల్లెలపై ప్రేమ ఉన్న పార్టీ అని చెప్పారు.
బీజేపీ అంటే తనకు లేదా ప్రధాని మోదీకి చెందిన పార్టీ కాదని, పార్టీకి జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలదని స్పష్టం చేశారు. తానూ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ కి సేవలు అందించానని గుర్తుచేసుకున్నారు. కార్యకర్తగా తాను వార్ధా జిల్లాలో స్కూటర్‌పై తిరిగేవాడినని, ఆ రోజులు తనకు తీపి జ్ఞాపకాలన్నారు. తాను రిజర్వేషన్లను వ్యతి రేకించనని, రాజకీయాల కోసం కుల మతా ల ప్రస్తావన తీసుకురావడం తనకిష్టం లేదన్నారు. కానీ, దశాబ్దాల తరబడి సామాజిక ంగా, ఆర్థికంగా, నాణ్యమైన విద్య పొందలేని వర్గాలు రిజర్వేషన్లు పొందాలని కోరుకుంటానని తేల్చిచెప్పారు.
ఏ పార్టీ పాలించినా దేశంలో సెక్యులర్ పాలన ఉండాలని కోరుకుంటానన్నారు. భారత రాజ్యాంగాన్ని అమ లు చేసే విధంగా పాలన ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీ పరంగా తన కు మహారాష్ట్ర నుంచి ఎలాంటి అధికారిక పాత్ర లేదన్నారు. కానీ, పార్టీకి అవసరమైనప్పుడు తాను రంగంలోకి దిగి సేవలందించ డానికి సిద్ధమని ప్రకటించారు. తనకు కిందిస్థాయి కార్యకర్తలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, వారంతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.