calender_icon.png 26 October, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాంగ్రెస్‌వి సెక్యులర్ భావాలు

28-08-2024 01:09:25 AM

  1. మోదీ సర్కార్‌వి మత విద్వేషాలు 
  2. సీడబ్ల్యూసీ సభ్యుడు తారీఖ్ అన్వర్ 

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలతో ముందుకు వెళుతోందని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్లూసీ సభ్యుడు తారీఖ్ అన్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే మైనార్టీ వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం జరుగు తుందని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిప డ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అమీర్ అలీఖాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమిం చడంతో మంగళవారం రవీంద్రభారతిలో ఆయనకు సన్మాన సభ నిర్వహించారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంత రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ అవలంభిస్త్నున ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్  పోరాటం చేస్తోంద న్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని పేర్కొ న్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హనుమంతరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా సొంత మీడియా అవసరం ఉందన్నారు.  అమీర్ అలీఖాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

ముస్లింలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పక్షాన నే నిలబడుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అమీర్‌అలీ ఖాన్ మాట్లాడుతూ సీఎం రేవం త్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఎం తో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్,  పీసీసీ ఫిషర్మెన్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్,  అఫ్సర్, శంభుల శ్రీకాంత్‌గౌడ్, నాయకులు హాజరయ్యారు.