* శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపైై చేతులు ఎత్తివేసినట్టు అర్థమవుతోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలోతు తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. సీఎం, మంత్రులు కూడా గ్యారెంటీలపై పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలప్పుడు ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారంటే ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉందని భట్టి సహా కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 43 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు.