calender_icon.png 8 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మరోసారి ధగా చేసిన కాంగ్రెస్

05-01-2025 07:34:50 PM

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దగా చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పెంచుతామని, రైతుభరోసాకు ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాత్రం రైతుల ఆశలను అడియాసలు చేసిందన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతీ సీజన్ లో రూ.7,500 ఇస్తామని చెప్పి రూ.6,000 వేలకు కుదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? రుణమాఫీని సగం మందికి కూడా ఇవ్వలేదని, బోనస్ ఇస్తామన్న హామీ బోగస్ అయ్యిందని పంట భీమా పత్తా లేదని రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని రైతు భరోసా డ్రామా మొదలు పెట్టారని కానీ రాష్ట్ర రైతులు  మీరు చేస్తున్న నమ్మకద్రోహాన్ని క్షమించరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని కామేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కోత లేకుండా పూర్తి స్థాయిలో రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు.