25-02-2025 02:43:40 AM
ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫలాలు లేవు
అన్ని వర్గాలను వేధిస్తున్న ప్రభుత్వం
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయి లు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని.. ఉద్యోగ విరమణ ఫలాలు కూడా అందించకుండా వారిని మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు న్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాసి న బహిరంగ లేఖలో ప్రశ్నించారు.
ఉద్యోగులకు సాధారణంగా చెల్లించాల్సిన బిల్లుల్లో నూ సీలింగ్ పెట్టడం సిగ్గుచేటని, నిజాయతీగా పనిచేసే ఉద్యోగులకు మీరిచ్చే సందేశం ఇదేనా అంటూ మండిపడ్డారు. కళాశాలల యాజమాన్యాల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఏండ్ల తరబడి ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆక్షేపించారు.
కాలేజీ ల యాజమాన్యాలు బిచ్చమెత్తుకొనే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకే మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమయ్యారని ఆరోపిం చారు. నిరుద్యోగ భృతి ఆశచూపి యువతను దగా చేశారని పేర్కొన్నారు.
14 నెలలు గా ఒక్కో యువకుడికి ప్రభుత్వం రూ.56 వేలు బాకీ పడిందన్నారు. ఏమాత్రం నిజాయతీ ఉన్నా యుద్ధ ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు రూ.7,500 కోట్ల ఫీజు రీయెం బర్స్‌మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల పదవీ విరమణ ఫలాలను తక్షణమే చెల్లించాలన్నారు.
వీటన్నింటిని తక్షణ మే పూర్తిచేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. దగా హామీలు, మోసపూరిత మాటలతో మభ్యపెడితే మోసపో యేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోష్యం చెప్పారు.