29-04-2025 01:24:51 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరా బాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అ ధిష్ఠానం తమ ముఖ్యమంత్రులపై నియంత్రణ కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభా ష్ విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ సీఎంలు సిద్ధ్దరామయ్య, రేవం త్ రెడ్డి అందుకు ఉదాహరణ అని చురకలంటించారు. కర్ణాటకలోని బెళగావిలో బీజేపీ కార్యకర్తల శాంతియుత నిరసనపై పోలీసులు క్రూరం గా ప్రవర్తించారని, ఇందుకు సీఎం సిద్ధరామయ్యే కారణమన్నారు.
ము ఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిపై పోలీసులు క్రూరం గా ప్రవర్తించడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటున్నా... సిద్ధ్దరా మయ్య మాత్రం కేంద్రంపై విమర్శలు చేసి పాక్‌కు మద్దతిఇచ్చేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.