మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హుజూర్నగర్, నవంబర్ 19: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 11 నెలల కాలంలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పాలకవీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎంత కొనుగోలు చేశారో లెక్కలు ప్రజలకు తెలియజేస్తే కాంగ్రెస్ బాగోతం బయపడుతుంద న్నారు.
మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు అపయోజత్సవాలు జరుపుకోవాలన్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో రైతులు తరిమికొట్టేలా ఉన్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, జక్కుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.