ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కామారెడ్డి, జనవరి 12 (విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన హమీలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు తనను జైలుకు పంపాలని కాంగ్రెస్ కేసులు పెడుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ కుట్రలకు తాము వెనుకడుగు వేయబోమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నేరవేర్చే వరకు గులాబీ పార్టీ పోరాటం చేస్తుందని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ పెడుతున్న కేసులకు బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం భయపడవద్దని సూచించారు. ఇప్పటికి ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు పెడితే బీఆర్‌ఎస్ వంద సీట్లు సాధిస్తుందని కవిత భరోసా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దగుట్టలో ఎమ్మెల్సీ కవిత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బడాపహడ్ హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా ఉర్సులో భాగంగా రెండవ రోజు ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చదార్ సమర్పించారు. కాలినడకన మెట్లు ఎక్కి పెద్దగుట్టలో మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ వెంట బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆయెషా, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ఉన్నారు..