calender_icon.png 10 March, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలనను కాంగ్రెస్ గాలికి వదిలేసింది

10-03-2025 12:00:00 AM

హుజురాబాద్, మార్చి9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పాలను గాలికి వదిలేసిందని, ఏ ఒక్క ప్రభుత్వ పథకం సక్రమంగా అమలు కావడం లేదని , జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టంగా తీర్పునిచ్చారని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. ఆదివారం రోజున సైదాపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపూర్ మండలం బిజెపికి కంచుకోట లాంటిదని , పార్టీ నాయకుల , కార్యకర్తల సమిష్టి కృషితో లోగడ స్థానిక సంస్థల్లో అనేక విజయాలు నమోదు చేసుకున్న చరిత్ర బిజెపికి ఈ ప్రాంతంలో ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల కోసం పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమాయత్తం  కావాలని పిలుపునిచ్చారు.