calender_icon.png 23 November, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది..

23-11-2024 01:48:57 PM

కామారెడ్డి (విజయక్రాంతి ): మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ.20 లక్షల పెట్టుబడితో మహిళా సంఘాలకు క్యాంటీన్ ఏర్పాటుకు నిధులు ఇస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ.3 కోట్ల నిధులను క్యాంటీన్లకు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.