calender_icon.png 9 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

06-09-2024 07:07:42 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పెద్ద చెరువులో ప్రత్యేక పూజలు చేసినా అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. రైతు రుణమాఫీ జరగని రైతుల కోసం గ్రామ గ్రామాన సర్వే చేసి కలెక్టర్ కార్యాలయంలో సహాయక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకుంటే ప్రతిపక్షాలు బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు మింగుడు పడడం లేదన్నారు. ప్రభుత్వంపై చౌకబార్ విమర్శలు చేస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారన్నారు. అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేటీఆర్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రజలు ఇక వారికి శాశ్వతంగా విశ్రాంతి ఇస్తారని అన్నారు.

అనంతరం బిబిపేటలో ఎస్ఆర్ఎం గార్డెన్లో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుంది అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించి భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. 20వేల మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఒక అడుగు ముందుకు వేసిన చత్రపతి శివాజీ ఫౌండేషన్ వారు ఇలాగే సమాజానికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేయాలని వారిని ప్రోత్సహించారు వారు చేస్తున్న ఉచితంబులెన్స్ ఇంటింటికి జూటు బస్తాల పంపిణీ విద్యార్థుల కోసమైన సదుపాయాలు సమకూర్చడం వంటి పనులు చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు