సన్న వడ్లకు బోనస్ చెల్లింపు శుభ పరిణామం...
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్వంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమా, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, రైతులకు బోనస్ చెల్లింపులు చేయడం శుభపరిణామమని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంథని మండలంలోని మల్లెపల్లిలో, సిరిపురం, విలోచవరం, నాగారం, గుంజపడుగు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ లు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి క్వింటాళ్ కు రూ.500 బోనస్ ఇస్తుందని, రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో అనేక పథకాలు అమలుచేస్తున్నారని, రాబోయే రోజుల్లో రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందించనుందన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దేవళ్ల విజయ్ కుమార్, మాజీ ఎంపిపి కొండ శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, బెల్లంకొండ సత్యనారాయణ రెడ్డి, రాం రాజశేఖర్ ఊదరి లచ్చయ్య, కుంట రాజు, ఇందారపు అనిల్, ఎరుకల మధు, కౌటం రమేష్, కోరవేన రవి,రొడ్డ రాజేశ్వర్ రావు, పర్శవేన మోహన్, మద్దెల రాజయ్య, ఇందారపు సదయ్య, శశికళ, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.