గతంలో అనుమతులిచ్చి.. ఇప్పుడు కూలుస్తున్నారు
అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనతతో అక్రమ కట్టడాలు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి): గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభు త్వమేనని.. ఇప్పుడు కూల్చివేతలు చేస్తోంది కూడా అదే పార్టీ సర్కారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించా రు. ఇప్పుడు కూలుస్తున్న ప్రభుత్వం అప్పు డు ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించా రు.
విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు? అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మిం చి సదుపాయాలు ఎలా కల్పించారు? ఇప్పు డు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అంద రికీ సమానంగా వర్తింపచేయాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సరికా దని, గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో హైడ్రాతో ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందని విమర్శించారు.
ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపించారు. పాలకులు, అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చా రా? అంటూ దుయ్యబట్టారు. అక్రమ నిర్మాణాలకు వాటర్, కరెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చా రని ప్రశ్నించారు. హైడ్రాతో అక్రమ నిర్మాణాలను ఎలాగైతే నేలమట్టం చేస్తున్నారో.. మౌలిక అవసరాలకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలపై మరోసారి ప్రభుత్వం లోతుగా చర్చించి, సమగ్రంగా అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని హితవుపలికారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి స్పష్టంచేశారు.