02-04-2025 12:07:28 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున హన్మకొండ 5వ డివిజన్ రెడ్డి కాలని, 57వ డివిజన్ గోకుల్ నగర్, 62వ డివిజన్ కాజిపేట్ సోమిడి,63వ డివిజన్ లలో సన్న బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణి చేసారు.ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్యపు రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెదలందరూ తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారు. ఉచిత సన్న బియ్యం పంపిణి కోసం ప్రభుత్వం కిలోకు రూ.40 వరకు ఖర్చు చేసింది. ధనవంతులు తినే సన్న బియ్యం ఇక పై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ లాంచనంగా ప్రారంభించడం జరిగింది.దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డ్ దారులకు ఉచితంగా సన్న బియ్యం కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తాము తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందని, అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, జక్కుల శ్రీనివాస్ యాదవ్,విజయ శ్రీ రజాలి, నల్ల స్వరూప రాణి, కాజీపేట తహసిల్దారు బావ్ సింగ్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అద్యక్షుడు బత్తుల రమేష్ , బంక సంపత్ యాదవ్,అనిత తదితరలు పాల్గొన్నారు.