calender_icon.png 3 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

02-04-2025 12:28:32 AM

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నాగల్ గిద్ద, ఏప్రిల్ 1: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం నాగల్గిద్ద మండలం లోని ఎనక్ పల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేదలకు సన్న బియ్యం అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీ తో దొడ్డు బియ్యం అక్రమాలను అరికట్టవచ్చు అని అన్నారు.  నా గలిగిద్ద మండలంలో రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు 8504 మందికి 1,86,637 కిలోల బియ్యం నెలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.

ఏనకపల్లి కొండనాయక్ తండ నుండి గొప్యానాయక్ తాండ హంగర్గా వరకు, రత్న నాయక్ తండ నుండి వాసర్ బిబ్య నాయక్ తండ వరకు, ఏనకపల్లి నుంచి ఫతునాయక్ తాండవరకు, ఫార్మేషన్ రోడ్డు మంజూరు చేశాము అన్నారు . త్వరలో ఫార్మషన్ రోడ్డు పూర్తయ్యాక బీటి రోడ్డు  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం వల్లేపూర్ లక్ష్మి ఇంటికి వెళ్ళి  చూసి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలని స్వయంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొబ్బరికాయ కొట్టడం జరిగింది.

ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో మహేశ్వర రావు, తాసిల్దార్ శివకృష్ణ, జిల్లా సివిల్ సప్లై అధికారి అంబాదాసు రాజేశ్వర్, ఎస్త్స్ర సాయిలు , యూత్ కాంగ్రెస్ వినోద్ పాటిల్,మాజీ ఎంపిటిసి నరసప్ప, పండరినాథ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, అబ్దుల్ రహీం ,శ్రీకాంత్ స్వామి, శాంతయ్య స్వామి, గంగారెడ్డి, సోపన్ రావు పాటిల్, వై.పండరి తదితరులు పాల్గొన్నారు.