calender_icon.png 20 March, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

20-03-2025 02:22:06 PM

ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు సమస్య పరిష్కారానికి కృషి 

జహీరాబాద్ లో యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సంగారెడ్డి, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు, ఎస్సీ వర్గీకరణ చేసిందని సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణంలో యువజన కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీసీలకు 42 శాతం బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రిజర్వేషన్ కమిటీ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి,  దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంచడం జరిగింది.  యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ అమలుతోబీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతారన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ కావడంతో ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం నాయకులు రఘు, విష్ణు, జీవన్, భాస్కర్, ఫయాజ్, సంగమేశ్వర్, అరుణ్, ప్రేమ్, సంతు, ప్రశాంత్, సోహెల్, అతిక్ అహ్మద్, లింభాజీ తదితరులు పాల్గొన్నారు.