10-04-2025 10:53:12 PM
30 ఏళ్ల కలను సహకారం చేసిన సీఎం రేవంత్..
సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు..
జాజిరెడ్డి గూడెం/అర్వపల్లి: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయాల్లో, ఉద్యోగ అవకాశాలలో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగల 30 ఏళ్ల కల నెరవేరుస్తూ ఎస్సి వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. గురువారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్, సామాజిక ఉద్యమకారుడు జీడి వీరస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీల్లో ఉపకలాల్ని 3 గ్రూపులుగా విభజించి 15శాతం రిజర్వేషన్లు కల్పించడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం రేవంత్ సర్కార్ ఆమోద ముద్ర వేయడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇకపై వెలువడే అన్ని ప్రభుత్వ నోటిఫికేషన్లలో అమలు కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు పాలెల్లి సురేష్, జాల నర్సయ్య, గుయ్యని బాబు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోలి కోటిరెడ్డి, గుడిపెల్లి మధుసూదన్ రెడ్డి, గుడిపెల్లి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ బుడిగె వెంకన్న, కాంగ్రెస్ నాయకులు నిమ్మల శేఖర్, ఇటికాల చిరంజీవి, నర్సింగ వెంకటేశ్వర్లు, బాలరాజు, కర్కాని సైదులు, రమణ, జీడి సైదులు, జీడి భాస్కర్, జీడి వెంకన్న, రవీందర్, మామిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.