calender_icon.png 11 April, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత, బహుజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

03-04-2025 01:08:34 AM

  • దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయింపు

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి 

గజ్వేల్/జగదేవపూర్, ఏప్రిల్ 2: బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, డిసిసి అధ్యక్షుడు,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. బుధవారం జగదేవపూర్ మండలంలోని నిర్మ ల్ నగర్, గజ్వేల్ మండలం అక్కారం గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా బా బాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం గ్రామాలలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బడుగులకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. దళిత బడుగులను ఆదుకోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, అసైన్డ్ భూములు, ఎద్దుల బండ్లు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.

దళితుడుని జాతీయ అధ్యక్షుడిగా నియమించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్నారు. పార్లమెంటులో రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన మోడీని దళిత సమాజం క్షమించదన్నారు. రాజ్యాంగం ను పరిరక్షించుకోవడంతోపాటు, దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత సున్నితమైన ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభు త్వానికి దక్కిందన్నారు.  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి దళితులను ఆదుకుంటామని చెప్పారు.వందలాది ప్రైవేట్ యూనివర్సిటీ లు తీసుకువచ్చి పేదలను గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ చదువులకు దూరం చేశారని మండిప డ్డారు.

నేడు చదువు వ్యాపారంగా మారిందని దుయ్యబట్టారు. పేదలను ఆదుకోవడానికి సన్న బియ్యం, త్వరలో పెన్షన్ ల పెంపుదల, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా సబ్సిడీపై రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ధ ర్మారం మల్లేశం, బత్తుల క్రాంతి, అజీజ్, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.