11-04-2025 01:11:34 AM
మునగాల, ఏప్రిల్ 10, సూర్యాపేట జిల్లా మునగాల:- నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన, నలబోలు సంజీవ్ రెడ్డి, కి ముఖ్యమంత్రి సహాయనిధి, నుండి, 60,000. రూపాయల చెక్ ని, జపాల్ రెడ్డి అందజేసి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మండల ప్రజలు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నలబోలు సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటయ్య, సీనియర్ నాయకులు గంధం సైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి, చందు లాల్ పాల్గొన్నారు.