08-04-2025 01:15:16 AM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ, ఏప్రిల్ 7: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని డేగబాబు ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 470 చెక్కులకు గాను నాలుగు కోట్ల 70 లక్షల 54, 520 మంజూరైనట్లుగా తెలిపారు.
వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, కోదాడ తహసిల్దార్ వాజిద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కోదాడ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, అనంతగిరి మండల అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు