సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కరీంనగర్, నవంబర్ 18 (విజయక్రాంతి):బీఆర్‌ఎస్ పాలనలో రైతులు దోపిడీకి గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం చెర్లబుత్కూర్‌లోని ధాన్యం కొనుగోలు కేందాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. గన్నీ బ్యాగు బరువుతో కలిపి నలభై ఒక్క కిలోల తూకం వేయాలని, అందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో గతేడాది ఈ తేదీ వరకు బీఆర్‌ఎస్ హయాంలో 65,732 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది ఈ రోజు వరకు 81,631 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.62 కోట్లు జమ అయ్యాయన్నారు. సన్నాలకు కూడా బోనస్ వెంటనే జమ అవుతున్నదని తెలిపారు. అనంతరం రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో మహేశ్, నరేశ్‌రెడ్డి, రంగారెడ్డి, రాయమల్లు, నర్సింహారెడ్డి, మల్లయ్య, కొండయ్య, వెంకటేశం, పద్మ, సరోజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.