calender_icon.png 19 April, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆరోగ్యానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

17-04-2025 01:02:26 AM

రూ. 10 లక్షల  ఉచిత వైద్య సేవల పరిది పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

 గజ్వేల్, ఏప్రిల్ 16 :  ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ సేవలను రూ. 10 లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని  రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు  ఆంక్షా రెడ్డి, గజ్వేల్ ఏఎంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,  మెడిసిటీ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఇందిరా  పార్క్ చౌరస్తా వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని బు ధవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా  వారు  మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు వైద్య సౌకర్యాలతో పాటు ఆరోగ్య శ్రీ పథకం ద్వా రా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు చికిత్సలు ఉచిత కాన్పులు చేయడం జరుగుతుందన్నారు.

అత్య వసర పరిస్థితులు మాత్రమే హైదరాబాద్ కు తరలించడం జరుగుతుందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య సంక్షేమ పథకాలతో పాటు అనేక పథకాలను అమలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి జంగం రమేష్ గౌడ్ నక్క రేగొండ, గాడి పల్లి శ్రీనివాస్ సమీర్ అజ్గర్ డప్పు గణేష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.