29-03-2025 02:34:17 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, మార్చి 28 : మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా ఉండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ముస్లింలకు ప్రభుత్వం తరుపున శుక్రవారం ఇఫ్లార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలూనాయక్ నాయక్ పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.