calender_icon.png 22 April, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

21-04-2025 12:00:00 AM

పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి 

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్20 (విజయక్రాంతి): పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు.మొదట తీగలగుట్టపల్లి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో ప్రాంభించి తర్వాత చామన్‌పల్లిలో, దుబ్బపల్లిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని  గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులు దోపిడీకి గురయ్యారని క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు దోచుకున్నారని అప్పుడు దోచుకున్న వారే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని,రుణ మాఫీ చేసి చూపించిందని రైతు భరోసా ఇచ్చిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో నియోజక వర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్,మూల రవీందర్ రెడ్డి,ఆకారపు భాస్కర్ రెడ్డి,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కాశెట్టి శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రెడ్డి కొలగానిఅనిల్,కొలగాని శ్రీనివాస్, అట్టేపు వేణు, కిరణ్ రెడ్డి,్ర పశాంత్ రెడ్డి, దీకొండ శంకరయ్య, జగ్గని కనుకయ్య, సిఏ మమత, పెద్దిగారి తిరుపతి, కాంపెల్లి కీర్తి కుమార్, గంగుల దిలీప్, లింగంపల్లి మంగ, బుర్ర గంగయ్య పాల్గొన్నారు.