బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు..
చర్ల (విజయక్రాంతి): బీసీ జనాభాపై ప్రభుత్వం తప్పుడు సర్వే లెక్కలు మానుకోవాలని చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాపాలనలో ప్రభుత్వం బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, రాష్టంలో అధికంగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాళ్లన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 52 శాతంగా ఉంటే, ప్రస్తుత కుల గణనలో 46 శాతం చూపిస్తున్నారని ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని ఒక ప్రయత్నం గతంలో ఓసీల జనాభా 10 శాతంలోపు అని చెపుతుండంగా, ఇప్పుడు 15 శాతం పెరిగిందని, అలాగే ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగితే, 50 లక్షల మంది బీసీల జనాభాను తక్కువ చేసి చూపడంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్ధం కావడం లేదు అని అన్నారు.
ఇప్పటికే EWS రిజర్వేషన్ పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుకునేందుకు కుల గణన సర్వేను ఉపయోగించుకొని బీసీలను తక్కువ చూపి అన్యాయం చేస్తుందని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే అందరూ కలిసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయం అని తెలిపారు. బీసీలను అణచివేస్తే సహించేది లేదని బీసీ జనాభా తగ్గింపుపై తక్షణమే సమగ్ర సమీక్ష జరపాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.