11-02-2025 05:16:15 PM
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని కే.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టిన బయపడేదే లేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, అక్రమ కేసులకు గురైన వారికి తోడు, నీడగా బీఆర్ఎస్ పార్టీ, తము ఉంటామని కార్యకర్తలు అందరు ధైర్యంగా ఉండాలని అన్నారు.
ఇప్పుడు పార్టీలో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మంది కార్యకర్తలతో సమాన అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత, అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఓడిన గెలిచిన నాయకులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైన సందర్భంలో వారి విఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు.
రాబోయే రోజులన్నీ బిఆర్ఎస్ అద్భుతంగా అధికారంలోకి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, అంకతి గంగాధర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.