calender_icon.png 20 March, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజామోద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్

20-03-2025 01:03:07 AM

వనపర్తి, మార్చి 19 ( విజయక్రాంతి ) : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన  రూ.  3,04,965 కోట్లు ప్రజా బడ్జెట్ ను  బుధవారం రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని ఈ బడ్జెట్ ప్రజా ఆమోద బడ్జెట్ అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా అన్నారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క   రూపొందించిన  బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగ్యంగా ఉందని, అన్ని రంగాలను త్వరితగతిన అభివృద్ధిపరిచేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  వ్యవసాయ రంగం, నీటిపారుదుల రంగం, గ్రామీణ అభివృద్ధి రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించడం హర్షనీయమన్నారు. 

 వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి