మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ట తిరుపతి యాదవ్..
మంథని (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ విజయోత్సవాలు నిర్వహిస్తుందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ట తిరుపతి యాదవ్ అన్నారు. బుధవారం రామగిరి మండల కేంద్రంలోని స్థానిక శ్రీపాద భవన్ ఐఎన్టియుసి ఆఫీస్ లో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, సిఎన్ సి టౌన్ అధ్యక్షులు కాటం సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ బర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వారికి జ్ఞానం లేదని విమర్శించారు.
తెలంగాణా ప్రజలని వంచించి గడీల పాలనను అంతమొందించి, తెలంగాణ ప్రజలకి స్వేచ్చను అందించింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడినందుకు ప్రజలు జరుపుకునే విజయోత్సవాలని అన్నారు. రామగిరి ఖిల్లా అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించింది, మంథని నియోజకవర్గంలో కోకకోల కంపెనీ తీసుకువచ్చిన ఘనత, మంథనికి ఐటీ కంపెనీ తీసుకొచ్చిన ఘనత, మంథని గోదావరి నుండి శివారు వరకు వంతెన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ఘనత, ఇంటిగ్రేట్ స్కూల్ లకు రూ.150 కోట్లు కేటాయించిన ఘనత మంత్రి శ్రీధర్ బాబుకే దక్కుతుందని, మీ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, మీ అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని మీరే చెప్పారని, రూ.200 ఉచిత విద్యుత్ అర్హులైన పేదలందరికి అందుతుందనే విషయం బహిరంగ రహస్యమని, మహిళలకు రూ.500 రూపాయలకే వంటగ్యాస్ అందుతుందని, రూ.18000 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి పూర్తి స్థాయిలో డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి సంసిద్దమై ఉన్నామని, గత ఐటి మినిష్టర్ తీసుకువచ్చిన పెట్టుబడులను మించి ఎక్కువ విదేశీ పెట్టుబడులను తీసుకుని వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబుదేనని, ఆస్తుల తెలంగాణా మీరు మీ ప్రభుత్వం అప్పుల తెలంగాణా చేస్తే మీరు చేసిన అప్పులను తీర్చే విధంగా ప్రణాళికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందిస్తుందని, మీరు కబ్జాలు చేసి అక్రమంగా కట్టిన వాటిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మీలా కుట్ర పూరిత చర్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూనుకోదని, విద్యార్థులను నిరుద్యోగులను మీరు లాటీలతో కొట్టిస్తే మేము కొలువులిచ్చి కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించుకున్నమని, మీ కేసీఆర్ భాష ఎట్టిదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి మరకలను ప్రక్షాళన చేస్తూ నీతివంతమైన పాలనను అందిస్తున్నామని, అందుకోసమై ప్రజలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ ఆరేళ్లీ దేవక్క కొమరయ్య గౌడ్, మాజీ ఎంపీపీ తులసిరాం గౌడ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లె రామ్మూర్తి, రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే పోషం, రామగిరి మండల ప్రచార కన్వీనర్ ముస్త్యల శ్రీనివాస్, తాజా మాజీ ఎంపీటీసీ తీగల సమ్మయ్య, తాజా మాజీ ఎంపిటిసి చిందం మహేష్, తాజా మాజీ ఎంపీటీసీ కొప్పుల గణపతి, రామగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ మరియు రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.