08-04-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ ఏప్రిల్ 7 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమనియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ, 57వ డివిజన్ పరిధిలోని కొత్తూర్ బ్రిడ్జి వద్ద చాపల మార్కెట్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే 57వ డివిజన్ పరిధి సమ్మయ్య నగర్ లో సిసి రోడ్లు, డ్రైనేజీ , మహిళా కమ్యూనిటీ హాల్ , 100 ఫీట్ రోడ్ సెంట్రల్ లైటింగ్ , రిటర్నింగ్ వాల్, సమ్మయ్య నగర్ నుండి కుడా కాలనీ బ్రిడ్జి అభివృద్ధి పనులను మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమీషనర్ తానాజీ స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
దశల వారిగా అన్ని డివిజన్ల లో పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సంహరించాలని, ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరం చేసే విధంగా కృషి చేస్తానని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచామని మళ్ళీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారికీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.
మెగా రక్తదాన శిబిరం...
ఫాతిమానగర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వాకర్ అసోసియేషన్, మహాత్మా గాంధీ స్మారక వైద్యశాల రక్తనిధి కేంద్రం వరంగల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తం కొరత లేకుండా చూడాలని లక్ష్యంతో, స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ప్రజలకు తెలియజేస్తూ , కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే ధ్యేయంతో, అన్ని దానాల కన్నా రక్తదానం మహాతర పుణ్య కార్యక్రమమన్నారు.
పలు డివిజన్ అధ్యక్షులు గజపాక రమేష్, ఎనుకోటి పున్నం చందర్, బంక సతీష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంక సంపత్, తక్కల్లపల్లి సారిక రావు మెజీషియన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ నాగరాజు, నాయిని లక్ష్మారెడ్డి, పల్లె రాహుల్ రెడ్డి కూరాకుల భారతి, మండల సమ్మయ్య, అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, కోడెపాక గణేష్, సురేష్ బాబు, ముప్పిడి శ్రవణ్, మున్సిపల్ అధికారులు, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.