18-03-2025 01:49:27 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజన పై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమ వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వ ర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ తరఫున ఎవరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
డీలిమిటేషన్‌పై తమ పార్టీ అభిప్రాయాలను ఈ నెల 22న చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగనున్న అఖిల పక్ష సమావేశంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ డీలిమిటేషన్‌తో దక్షిణాదికి జరుగబోయే నష్టం గురించి జాతీయ వేది కలపై మట్లాడి తీరుతుందన్నారు.