calender_icon.png 31 January, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల ప్రభుత్వం

26-01-2025 07:43:39 PM

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తుందని జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రారంభించారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఇల్లందు మండలం పూబల్లి పంచాయతీలో పథకాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... రైతు భరోసా 344, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 09, రేషన్ కార్డ్స్ 45, ఇందిరమ్మ ఇల్లు 86, మొత్తం 484 మందికి పంపిణీ చేశారు. టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీలో రైతు భరోసా 470, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 32, రేషన్ కార్డ్స్ 392, ఇందిరమ్మ ఇల్లులు 420 మందికి అందించారు. 

బయ్యారం మండలం నామాలపాడు పంచాయతీలో రైతు భరోసా 52, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 774, రేషన్ కార్డ్స్ 20, ఇందిరమ్మ ఇల్లు 115 మందికి అందించారు. గార్ల మండలం బిఆర్ఎన్ తండాలో రైతు భరోసా 88, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 26, రేషన్ కార్డ్స్ 51, ఇందిరమ్మ ఇల్లులు 49 మంది లబ్ధిదారులకు అందించారు. కామేపల్లి మండలం, పొన్నెకల్లు పంచాయతీలో రైతు భరోసా 1100 మందికి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 93, రేషన్ కార్డ్స్ 105, ఇందిరమ్మ ఇల్లులు 90 మందికి అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...

కాంగ్రెస్ ఒక్కటే పేదల ప్రభుత్వం.. 

ఇందిరమ్మ పాలనతోనే వెలుగులు..

ప్రతి ఒక్కరికి పథకాల అమలు చేస్తాం..

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదల పక్షమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇల్లందు కనకయ్య అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే ఈ దేశానికి వెలుగులు నిండాయని అన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేదకు అందే వరకు ప్రభుత్వం విశ్రమించబోదన్నారు. గత పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో ప్రజలంతా ఏకమై తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవానికి న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. గరీబీ హఠావో నినాదంతో దివంగత నేత ఇందిరమ్మ పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నదని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ పథకాలు నిరంతరం కొనసాగుతాయన్న విషయాన్ని ప్రజలు గమనంలో ఉంచుకోవాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో తెల్లం వెంకటరావు, నియోజవర్గంలో పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట నియోజకవర్గంలో జారే ఆదినారాయణ, కొత్తగూడెం నియోజకవర్గంలో కలెక్టర్ జితేష్ వి పటేల్ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.