calender_icon.png 9 April, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, బీసీ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం: సంతోష్‌రెడ్డి

24-03-2025 01:16:44 AM

మోతె, మార్చి 23:- ఎన్నో ఏండ్ల నుండి పోరాటం చేస్తున్న ఎస్సి,బిసిలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి ఇచ్చిన మాట నెలబెట్టుకుంది....చారిత్రాత్మకంగా ఎస్సి,బిసి బిల్లులను అసెంబ్లీలో  ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పలు మంత్రుల ఫొటోలకు పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల పక్షమని ఇందిరమ్మ  ఆకాంక్షతో రాష్టంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు..ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి,బొర్రా మధు,ఉప్పుల వినోద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెలుగు వీరన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.