22-02-2025 01:29:56 AM
కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ లో కేంద్ర బడ్జెట్-2025 పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లీగల్ కన్వర్టెట్ అంటే అర్థం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఇచ్చిన మాట తప్పుతు న్న కాంగ్రెస్, ప్రధానమంత్రి కులం విషయాన్ని రాజకీయం చేస్తున్నదని విమర్శించా రు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగానే ప్రధాని కులాన్ని బీసీలో చేర్చారని గు ర్తు చేశారు. ఇటీవల జరిగిన సర్వేలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 52 శాతం ఓట్లు వస్తాయని తేలిందని చెప్పారు. గతంలో 49 శాతం ఉండేదని, 3 శాతం పెరిగిందని వివరించారు. రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం నిధులు కేటాయిస్తుందని, కేం ద్రం ముందు అందరు సమానమని, విపక్షా లు ఏమి ఇచ్చారు అనడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఏపీలో సూపర్ సిక్స్ హామీలు ఒకదా ని తర్వాత ఒకటి అమలవుతున్నాయని, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. కృష్ణ జలాల వాటాల విషయం ట్రిబ్యునల్ లో తేలాల్సి ఉందని, దీన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తేల్చుకోవాలని అన్నారు. బడ్జెట్‌పై మాట్లాడుతూ తెలంగాణలో రైల్వేలు, రోడ్ల కోసం 18,750 కోట్లు కేటాయించిందని, 2047 వరకు వికసిత్ భారత్‌గా చూడాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు.
ఇదేరోజు కరీంనగర్ వైశ్యభవన్లో మేధావుల సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర బడ్జెట్ పై ఉపన్యసించారు. మోడీ సంస్కరణలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయట పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు, వికసిత్ భారత్ బడ్జెట్ ప్రో గ్రాం రాష్ర్ట సమన్వయకర్త గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజే పీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.