30-04-2025 06:49:55 PM
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): రైతులను తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని గుల్లకోట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి కట్టింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రంలో మాత్రం ప్రతి 40 కేజీల బస్తకు రెండు కేజీలు అదనంగా కాంటా వేసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఏలాంటి కటింగు లేకుండా, ఏలాంటి షరతులు లేకుండా రైతుల దగ్గర నుంచి మరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగయ్య, గుల్లకోట మాజీ సర్పంచ్ గొల్ల రవీందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.