మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
చేగుంట (చిన్నశంకరంపేట), జూన్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి రైతుకు సబ్సిడీ కింద విత్తనాలు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల పరిధిలోని 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. నాయకులు ఆవుల గోపాల్‌రెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.