11-03-2025 12:47:42 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,మార్చి10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలంలోని టేకులు చెరువు గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు కాలువ నుండి దోమల వాగు చెరువుకు 75 హెచ్పీ కెపాసిటీ గల మోటార్ సహాయంతో సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారుల సహాయ సహకారంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.గత పది సంవత్సరాల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను చేయడం సంతోషంగా ఉందని అన్నారు.రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు.ఈ నీటి విడుదల ద్వారా సుమారు1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
రానున్న రోజుల్లో బూర్గంపాడు,అశ్వాపురం మండలాలలో పంటలకు సాగునీటిని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతీ ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా రూ.12వేలు అందించిందని తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా పని చేస్తుందన్నారు.ఈ సందర్భంగా మండల రైతులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్ రెడ్డి,ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డిఈ శ్రీనివాస్, ఏఈ గణేష్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,మాజీ ఉప సర్పంచులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు బట్టా విజయ్ గాంధీ,భజన ప్రసాద్, భజన సతీష్, కిషోర్, చల్లా వెంకటనారాయణ, బాదం రమేష్ రెడ్డి, బాదం నాగిరెడ్డి, ఇంగువ రమేష్ పాల్గొన్నారు