calender_icon.png 23 March, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేకిగా మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

22-03-2025 07:59:11 PM

ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి..

TUCI జిల్లా ఉపాధ్యక్షుడు గోనెల రమేష్ డిమాండ్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడుతూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మారుతోందని టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు గోనెల రమేష్ ఆరోపించారు. శనివారం పాల్వంచలోని TUCI  కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... TUCI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకుబ్ షావలి ఉపాధ్యక్షులు గోనెల రమేష్, వై గోపాలరావు సహాయ కార్యదర్శి పెద్ద బోయిన సతీష్, బోళ్ల సీతారాములు. రాయల సిద్దు. బొల్లి రవి, కొత్తగూడెం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య. ఇఫ్టు జిల్లా అధ్యక్షులు,కే సారంగపాణి, తదితర ట్రేడ్ యూనియన్స్ నాయకులను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. 

హైదరాబాద్ ఇందిరా పార్కులో శనివారం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చిందన్నారు. పర్మిషన్ ఉన్న ముందస్తు అరెస్టులు చేయడం కేసిఆర్ నియంత పాలనను, మించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం అధికారంలో కొస్తే ప్రజ పాలన అందిస్తాం ఈ రాష్ట్రంలో అరెస్టు ఉండవు ఆందోళనలు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అక్రమ అరెస్టు కొనసాగించడం దేనికి నిదర్శనం అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు కార్మిక సమస్యలపై ప్రశ్నించడం నేరమా హక్కుల ఆములకై ధర్నాలకు పిలుపునివ్వడం నేరమా అని వారు విమర్శించారు. 

కేసిఆర్ ప్రభుత్వంలో, కార్మికుల కనీస వేతనాల ఐదు జీవోలను విడుదల చేసిందని ఈ జీవోలు అమలుకు రాకుండా గెజిట్లు విడుదల చేయలేదని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిస్తే ఈ నిరసనకు వెళ్ళనీయకుండా ఆప్రజాస్వామికంగా కార్మికుల్ని, నాయకుల్ని అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. అరెస్టులు బెదిరింపులతోటి ప్రజా పాలనను ఎంతోకాలం నడపలేరని అన్నారు. అరెస్టుల పట్ల INTUC  నాయకులు మాట్లాడాలని అన్నారు. తక్షణమే కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేందుకు గెజిట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నడుస్తున్న సందర్భంగా ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUCI  నాయకులు భాస్కర్, జీ.వెంకటేశ్వర్లు, శ్రీహరి, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.