calender_icon.png 2 April, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం

01-04-2025 05:24:30 PM

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన సన్నబియ్యం లబ్ధిదారులు.. 

గజ్వేల్: పేదల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వమని ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి రాములు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంగళవారం లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

ఎక్కడా లేనివిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 ల గ్యాస్ సబ్సిడీ అమలు చేశారన్నారు. రైతులకు ఎన్నడూ లేని విధంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. మరోసారి పేదలపై ఉన్న ప్రేమను వెల్లడిస్తూ రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేపట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు. ప్రజలంతా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, రమేష్, స్వామి, నర్సింహా రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.