calender_icon.png 23 November, 2024 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

23-11-2024 02:23:53 AM

డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వవైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు

బీజేపీ సిద్దిపేట జిల్లా  అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి

గజ్వేల్, నవంబర్ 22: ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకటి, రెండు హామీలను మాత్రమే అమలు చేసి, మిగతా హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులంతా ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారన్నారు.

వరికి రూ.500 బోనస్ రైతులకు అందలేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందన్నారు. 12నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ డిసెంబర్ 1నుంచి 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.కార్యక్రమంలో బీజేపీ లీడర్లు ఏర్పుల వెంకటరమణ, పూదరి నందన్‌గౌడ్, ఎల్లురాం రెడ్డి పాల్గొన్నారు.